గురువారం 04 జూన్ 2020
Telangana - May 18, 2020 , 15:00:30

ఉద్దీపనలతో గిరిజనులకు ప్రయోజనం శూన్యం

ఉద్దీపనలతో గిరిజనులకు ప్రయోజనం శూన్యం

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలతో గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. ఈ ప్యాకేజీలతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం లేదని ఆమె చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గిరిజనుల పరిస్థితులపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. రూ.20 లక్షల కోట్లలో గిరిజనులకు నేరుగా లబ్దిచేకూరేదేమీ లేదని చెప్పారు. ప్యాకేజీలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, రవాణా వసతి పటిష్ట పర్చాలని కోరారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని, లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రికి ఆమె వివరించారు.


logo