శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 01:53:06

బీజేపీది బొందమీది ప్యాకేజీ

బీజేపీది బొందమీది ప్యాకేజీ

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు: కరోనా కష్టకాలంలో బీజేపీ ప్రభుత్వం బొందమీది ప్యాకేజీ ప్రకటించిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బుధవారం మహబూబాబా ద్‌ జిల్లా తొర్రూరులో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ముస్లింలకు రంజాన్‌ పండుగ సామగ్రిని పంపిణీచేశారు. అనంతరం మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన రాష్ర్టాలను కేంద్రం ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తుంటే.. రాష్ర్టాన్ని కుదువపెడితే అప్పులు ఇస్తామంటూ షరతులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ధాన్యం క్వింటాల్‌కు కనీసం రూ.1000 కూడా ఇవ్వట్లేదని.. ఇక్కడ మాత్రం ఆ పార్టీల నాయకులు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 


logo