శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 11, 2020 , 01:38:15

వైద్య పరికరాలపై పన్ను వద్దు

వైద్య పరికరాలపై పన్ను వద్దు

  • కేంద్రమే వాటిని రాష్ర్టాలకు అందజేయాలి
  • కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో తయారయ్యే మందులు, వైద్యపరికరాలపై పన్ను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌.. కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వైద్యపరికరాలకు కూడా కస్టమ్స్‌, ట్యాక్స్‌ను రద్దుచేయాలని విజ్ఞప్తిచేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో హర్షవర్ధన్‌ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి ఈటల బీఆర్కేభవన్‌నుంచి పాల్గొన్నారు. వెంటిలేటర్లు, ఎన్‌-95 మాస్కులు, పీపీఈకిట్లు, టెస్టింగ్‌ కిట్లు, ఇతర వైద్య పరికరాలను ఈసీఐఎల్‌, డీఆర్డీవో వంటి సంస్థల్లో తయారుచేయించి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని ఈటల కోరారు. కరోనా వైద్య పరికరాలను బ్లాక్‌మార్కెట్‌ చేయకుండా నియంత్రించాలని, వాటిని కేంద్రమే సేకరించి రాష్ర్టాలకు అందించాలని విన్నవించారు. కరోనా నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించిన ఆయన.. లాక్‌డౌన్‌ పొడిగించే అంశంపై అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరుగలేదని, ఇక్కడి పాజిటివ్‌ కేసుల్లో 85 శాతం మర్కాజ్‌ నుంచి వచ్చినవేనని తెలిపా రు. ఇవి తగ్గితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేంద్రమంత్రికి వివరించారు.

కరోనా కట్టడికి ఐఏవోపీ విరాళం

కొవిడ్‌-19 చికిత్సకు అవసరమైన వైద్యప రికరాలను ఇచ్చేందుకు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (ఐఏవోపీ) జంటనగరాల విభాగం ముందుకొచ్చింది. ఐఏవోపీ ప్రతిని ధులు రూ.14 లక్షల విలువైన వైద్యపరికరా లను శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్‌కు అందజేశారు. వాటిని గాంధీ, నిలోఫర్‌ దవాఖానల్లో వాడాలని కోరారు.  విరాళంలో ఎన్‌-95 మాస్క్‌లు, పీపీఈకిట్లు, ఏరో మిషన్లు ఉన్నాయి. మంత్రిని కలిసినవారిలో ఐఏవోపీ జంటనగరాల విభాగం అధ్యక్షుడు సీఎన్‌ రెడ్డి, కార్యదర్శి భాస్కర్‌, కోశాధికారి శ్రీధర్‌, కార్యవర్గసభ్యులు లాలూప్రసాద్‌ రాథోడ్‌, అజయ్‌ ఉన్నారు. 


logo