మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 15:24:31

నగరంలో కరోనా లేదు..కంగారు పడొద్దు:సీపీ సజ్జనార్

నగరంలో కరోనా లేదు..కంగారు పడొద్దు:సీపీ సజ్జనార్

హైదరాబాద్‌: నగరంలో కరోనా లేదని..ఎవరూ కంగారు పడొద్దని సైబరాబాద్ సీపీ, ‘కరోనా’ నోడల్ అధికారి సజ్జనార్ తెలిపారు. జ్వరం ఉంటే తప్ప మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని సూచించారు. అధికారికంగా వెలువడిన వార్తలనే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఫార్వర్డ్ చేయొద్దని పేర్కొన్నారు. కరోనాపై ఐటీ కారిడార్‌లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు పలు కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలు, ఉన్నతాధికారులతో సీపీ సజ్జనార్ గురువారం సమావేశమయ్యారు.

కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. జ్వరం ఉంటే తప్ప.. మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రహేజా మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను ఆయన తోసిపుచ్చారు. మైండ్ స్పేస్ ఐటీ సముదాయంలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టుగా వెలువడిన వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. పుణె నుంచి వచ్చిన నివేదికలో ఫలితం నెగిటివ్‌గా వచ్చిందని నిర్ధారించారు. నగరంలో అసలు కరోనా లేదని అందరూ ప్రశాంతంగా ఉండాలని స్పష్టం చేశారు. 

వదంతులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించడానికి, నిజాలు నిర్ధారించుకోవడానికి పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో   వస్తున్న పుకార్లను  నమ్మొద్దని ఐటీ సంస్థలకు సూచించారు. కరోనా లేదని ఉద్యోగులు భయం లేకుండా పని చేసుకోవచ్చని అన్నారు. ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోం’ చేయించాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో 250 ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.  


logo