మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 14:00:14

కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు: మంత్రి ఈటల

కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు: మంత్రి ఈటల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో మందుల కొరతపై మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. మందుల కొరతపై తన కార్యాలయంలో ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, డాక్సామెతాసోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలొన్‌ మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు. విటమిన్‌-డీ, సీ, మల్టీవిటమిన్‌, జింక్‌ వంటి ఔషధాలను మందుల దుకాణాలు, దవాఖానల్లో సరిపడినన్ని ఉంచాలని చెప్పారు.


logo