మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 22:38:14

అవినీతి అధికారులకు నో పాస్‌పోర్ట్‌

అవినీతి అధికారులకు నో పాస్‌పోర్ట్‌

న్యూఢిల్లీ : అవినీతి అధికారులకు ఇకపై పాస్‌పోర్ట్‌ లభించదు. అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన లేదా కోర్టుల్లో అవినీతి, నేర సంబంధ కేసులలో నిందితులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులకు పాస్‌పోర్ట్‌ జారీకి సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ అధికారులకు విజిలెన్స్‌ క్లియరెన్స్‌ తప్పనిసరి అని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు లేదా నేర సంబంధ కేసులున్నట్లు విజిలెన్స్‌ నివేదికలో తేలితే వారి పాస్‌పోర్టును తిరస్కరిస్తారు. విదేశాల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులకూ ఇది వర్తిస్తుంది. ఆ అధికారి వల్ల ఇతర దేశాలతో భారత సంబంధాలకు నష్టం జరుగుతుందని భావించిన పక్షంలోనూ పాస్‌పోర్టును తిరస్కరించే అవకాశమున్నది. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌, విదేశాంగ మంత్రిత్వశాఖతో సమీక్ష నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.


logo
>>>>>>