గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 14:55:15

ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా చూస్తాం..

ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా చూస్తాం..

పెద్దపల్లి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున ఆయన 396 మంది నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ముంబైలో చిక్కుకుపోయిన తొమ్మిది వందల మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున తమ ట్రస్టు తరపున అందించామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ మండల ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమవందుగా సహకారం అందించాలన్నారు. 


logo