శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Mar 27, 2020 , 01:36:25

ఆ నలుగురు లేక..

ఆ నలుగురు లేక..

  • ట్రాక్టర్‌పై అంతిమయాత్ర 
  • సామాజిక దూరం పాటింపు

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా అంటేనే ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నారు. కార్యం ఏదైనా అందులో పాల్గొనేందుకు జంకుతున్నారు. ఇందుకు ఓ విశ్రాంత ఉద్యోగి అంతిమయాత్రే నిదర్శనం. నారాయణపేట జిల్లాకేంద్రంలోని సింగార్‌బే స్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి హన్మంతు(65) బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించాడు. అదే రాత్రి బంధుమిత్రులకు సమాచారమిచ్చారు. కరోనా భయాం దోళనతో ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. వచ్చిన కొందరు కూడా దూరం నుంచే చూసి వెళ్లారు. మధ్యాహ్నం అంత్యక్రియలకు సిద్ధం చేయగా పాడె మోసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేసేదేమి లేక ఓ ట్రాక్టర్‌లో అంతిమయాత్ర నిర్వహించారు. వచ్చిన ఆ కొద్ది మంది కూడా సామాజిక దూరం పాటించి ముందుకుసాగారు. దీంతో కుటుంబ సభ్యులు కొద్ది సేపట్లోనే అంత్యక్రియలను పూర్తిచేసుకొని ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. 


logo