శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 11:51:07

ఫ్లోరైడ్ ర‌హిత రాష్ర్టంగా తెలంగాణ‌

ఫ్లోరైడ్ ర‌హిత రాష్ర్టంగా తెలంగాణ‌

హైద‌రాబాద్ : రాష్ర్ట ఏర్పాటుకు ముందు తెలంగాణ‌లోని ప‌లు ప‌ల్లెల‌ను ఫ్లోరైడ్ ప‌ట్టిపీడించింది. ఫ్లోరైడ్ స‌మ‌స్య నుంచి విముక్తి కోసం అనేక పోరాటాలు చేశారు. అంతే కాదు ఢిల్లీ గ‌డ‌ప‌ను కూడా తొక్కారు. అయిన‌ప్ప‌టికీ నాటి ప్ర‌భుత్వాల్లో చ‌ల‌నం లేదు. ఆయా ప్ర‌భుత్వాలు ఇచ్చిన హామీలు నీటి మీద రాత‌లుగానే ఉండిపోయాయి. కానీ స్వ‌రాష్ర్టంలో ఫ్లోరైడ్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించింది. ఈ స‌మ‌స్య నుంచి విముక్తి పొందేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మం ఎంతో దోహ‌ద‌ప‌డింది. ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజలకు సురక్షిత త్రాగు నీరు అందించాలనే ఉద్దేశ్యంతో  మిష‌న్ భ‌గీర‌థ ద్వారా గోదావ‌రి, కృష్ణా జ‌లాల‌ను ప్ర‌తి ఇంటికి అందిస్తున్నారు. ఈ ప‌థ‌కం ఫ‌లితాల‌కు కేంద్రం విడుద‌ల చేసిన నివేదిక‌నే నిలువెత్తు నిద‌ర్శ‌నం. తెలంగాణ‌లో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవ‌ని కేంద్ర‌మే స్ప‌ష్టం చేసింది. 

ఈ సంద‌ర్భంగా ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ర్ట ఆవిర్భావానికి ముందు తెలంగాణ‌లో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవ‌ని తెలిపారు. మిష‌న్ భ‌గీర‌థ‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డంతో.. ఇవాళ రాష్ర్టంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవు అని స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవ‌ని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మిష‌న్ భ‌గీర‌థ బృందానికి కేటీఆర్ అభినంద‌న‌లు చెప్పారు.