కరోనా కొత్త స్ట్రెయిన్‌తో ఆందోళన అవసరం లేదు : గవర్నర్

హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ముందంజలో ఉండటం గర్వకారణమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. భారత్ బయోటెక్‌ను సందర్శించి ప్రధాని మోదీ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఉత్తేజం నింపారని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో వ్యవహరించాలని సూచించారు. వ్యాక్సిన్ తయారీకి రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. కరోనాపై పలువురు నెటిజన్లు ట్విటర్లో అడిగి ప్రశ్నలకు సోమవారం ఆమె సమాధానం ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.