శనివారం 30 మే 2020
Telangana - Apr 30, 2020 , 16:48:34

సహాయం చేసేందుకు ధనవంతులే కానక్కరలేదు : వనపర్తి కలెక్టర్

సహాయం చేసేందుకు ధనవంతులే కానక్కరలేదు : వనపర్తి కలెక్టర్

వనపర్తి : సహాయం చేసేందుకు ధనవంతులే కానక్కరలేదని... మంచి మనసుంటే చాలని వనపర్తి జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ భాష అన్నారు. జిల్లాలోని వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్‌శెట్టి అనే వ్యక్తి తనకొస్తున్న ఫింఛనులోంచి మిగుల్చుకోగా ఉన్న రూ.10 వేల నగదును కరోనా సహాయార్థం జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... సహాయం చేసే గుణమున్న చంద్రశేఖర్‌లాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరమని కొనియాడారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సహాయం అందించటానికి ధనవంతులే కానక్కరలేదన్నారు. కరోనా కష్ట కాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిందిగా కలెక్టర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  


logo