ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 03:01:06

రాష్ట్రంలో కొత్తగా 945 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 945 పాజిటివ్‌  కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో మంగళవారం 945 కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నమోదైన కేసులే 869 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి -21, మేడ్చల్‌-13, నిర్మల్‌లో 4 కేసు లు రాగా, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండుచొప్పున, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున న మోదయ్యాయి. వైరస్‌తో ఏడుగురు ప్రా ణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 88,563 మందికి పరీక్షలు చేయగా.. 16,339 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 260 మంది మరణించారు. చికిత్స అనంతరం మంగళవారం 1,712 మందితో కలిపి మొత్తం 7,294 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకవార్డులు  

కరోనా బాధిత ట్రాన్స్‌జెండర్ల కోసం దవాఖానల్లో ప్రత్యేకవార్డులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
మంగళవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు  
945
16,339  
డిశ్చార్జి అయినవారు   
1712
7,294
మరణాలు  
  7  
260
చికిత్స పొందుతున్నవారు     
-
8,785
logo