మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 03:00:26

పంజాబ్‌లో మక్క రైతు పరేషాన్‌!

పంజాబ్‌లో మక్క రైతు పరేషాన్‌!

  • పంటలు కొనేవారులేక తీవ్ర ఇబ్బందులు
  • సగం ధరకు అమ్ముదామన్నా దిక్కులేదు 
  • ప్రభుత్వం వద్దన్నా సాగుచేయడంతో కష్టాలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పంజాబ్‌లో మక్కలు పండించిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. మక్కల కొనుగోలుకు ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు ఏజెన్సీలు ముందుకురాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర (రూ.1,850) సంగతి దేవుడెరుగు, సగం ధరకు అమ్ముదామన్నా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు రూ.1,100 ధరకు ముందుకురావడంతో రూ.750 నష్టం వస్తున్నా రైతులు గతిలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్నారు. వాస్తవానికి దేశంలో ఇప్పటికే మక్కల నిల్వ అవసరానికి మించి ఉన్నది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం మక్కజొన్న సాగువద్దని సూచించింది. అయినప్పటికీ మక్కసాగుచేసిన రైతులు ఇప్పుడు పంటను అమ్ముకునే దారిలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వానకాలం సీజన్‌లో మక్కసాగు చేయొద్దని రైతులకు సూచించింది. మక్కకు బదులుగా డిమాండ్‌ ఉన్న కంది, పత్తి పంటలను సాగు చేయాలని పేర్కొన్నది. ప్రభుత్వ సూచనను పాటిస్తున్న తెలంగాణ రైతులు మక్కసాగు జోలికి వెళ్లడం లేదు. కొంతమంది రైతులు పౌల్ట్రీ, డెయిరీ అవసరాలకు మక్కను సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో మక్కసాగుచేస్తుండగా.. ఈ సారి కేవలం 65 వేల ఎకరాలకే పరిమితమైంది.


logo