ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 07:41:03

ఇవాళ, రేపు పంటలు కోయొద్దు, మార్కెట్‌కు తేవద్దు: మంత్రి నిరంజన్‌రెడ్డి

ఇవాళ, రేపు పంటలు కోయొద్దు, మార్కెట్‌కు తేవద్దు: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంటంతో ఇవాళ, రేపు పంట కోతలు పెట్టుకోవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. నివర్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతారణ కేంద్రం ప్రకటించింది. ఈనేపథ్యంలో నేడు, రేపు పంటలను కోయొద్దని, పంటను మార్కెట్లకు తేవద్దని మంత్రి కోరారు.   

నివర్‌ తుఫాను తీరం దాటి తీవ్ర తుఫానుగా మారింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడ‌క్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొన్నది. ప్రధా‌నంగా నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, వన‌పర్తి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నారా‌య‌ణ‌పేట్‌, జోగు‌లాంబ గద్వాల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లా‌ల్లోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి‌భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. రంగా‌రెడ్డి, మేడ్చల్‌, హైద‌రా‌బాద్‌, యాదాద్రి జిల్లాల్లో ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.