శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 13:00:23

కేంద్ర చ‌ట్టంతో ఉచిత విద్యుత్‌కు కోత‌

కేంద్ర చ‌ట్టంతో ఉచిత విద్యుత్‌కు కోత‌

హైద‌రాబాద్‌: రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించేలా కేంద్ర నూత‌న విద్యుత్ చ‌ట్టం ఉన్న‌ద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల పేద‌ల‌కు ఉచిత క‌రెంటు ఇచ్చే అవకాశం ఉండ‌ద‌ని చెప్పారు. కేంద్ర విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా శాస‌న మండ‌లి తీర్మానం చేసింది. ఈ సంద‌ర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మ‌డి రాష్ట్రంలో క‌రెంటు స‌మ‌స్య తీవ్రంగా ఉండేద‌ని చెప్పారు. క‌రెంటు కోత‌ల వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. 

తెలంగాణ ఏర్ప‌డే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ కొర‌త ఉంద‌ని చెప్పారు. స్వ‌రాష్ట్రంలో అతి త‌క్కువ స‌మ‌యంలో విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించామ‌న్నారు. అన్ని రంగాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇస్తున్నామ‌ని చెప్పారు. రైతుల‌కు ఉచితంగా 24 గంట‌లు విద్యుత్ అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. కేంద్ర నూత‌న చ‌ట్టంతో ఉచిత విద్యుత్‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. బోరు బావుల‌కు విద్యుత్ మీట‌ర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌న‌న్నారు. 


logo