మంగళవారం 26 మే 2020
Telangana - May 05, 2020 , 15:56:10

1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేవు

1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేవు

నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వ ఆదేశం

జీవో జారీ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్‌: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నేపద్యంలో తరగతులు నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.


logo