మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 18:48:55

సెక్రెటేరియట్‌లో విజిటర్స్‌కు నో ఎంట్రి

సెక్రెటేరియట్‌లో విజిటర్స్‌కు  నో ఎంట్రి

హైదరాబాద్ : కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకంటున్నది. వైరస్‌ ప్రబలకుండా హైదరాబాద్‌లోని సెక్రెటేరియట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకను నిలిపి వేసింది. ఒకవేళ ఎవరికైనా అత్యవసర పని ఉంటే ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి అనుమతి తీసుకోవాలి.  ముఖ్యంగా సచివాలయం ఎంట్రెన్స్‌లో థర్మల్‌ స్కానర్‌లు ఇన్‌స్టాల్‌ చేశారు. ఉద్యోగులందరికీ మాస్క్‌లు, శానిటైజర్‌లు అందజేస్తున్నారు. బాత్‌రూమ్‌లు, లిఫ్ట్‌లు, తలుపులు వంటి తరచు ముట్టుకునే చోట్ల ప్రత్యేకంగా శుభ్రం చేస్తున్నారు. హౌస్‌కీపింగ్‌ సిబ్బందిని పెంచి స్వచ్ఛ చర్యలు చేపట్టారు. ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వారికి ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసి తగిన చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. 


logo