శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 09:08:37

విదేశాల నుంచి వచ్చిన వారు 28 రోజుల వరకు తిరుమలకు రావొద్దు

విదేశాల నుంచి వచ్చిన వారు 28 రోజుల వరకు తిరుమలకు రావొద్దు

హైదరాబాద్‌: విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన అనంతరం 28 రోజుల వరకు తిరుమలకు రాకుండని తిరుమల తిరుపతి దేవస్థాయం విజ్ఞప్తి చేసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు. టోల్ గేట్ వద్ద  భక్తులకు వైద్యపరిక్షలు నిర్వహిస్తున్నారు. అస్వస్థత కి గురైన భక్తులతిరుమల యాత్రను రద్దు చేసుకొని వారి టికెట్టును [email protected]కి మెయిల్ చేస్తే మరో రోజు దైవదర్శనం ఏర్పాటు చేసుకోవడానికి లేదా నగదు తిరిగి పొందడానికి వీలుంటుందని దీనికి భక్తులు వైరస్ వ్యాపించకుండా సహకరించాలని ప్రార్థించారు.

ఈనెల 17నుండి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని గదులలో వేచి ఉండే వీలు లేదు. టైమ్ స్లాట్ ప్రకారం వారు పొందిన టైమ్ కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి  అనుమతిస్తారు.  17వ తేదీన దివ్యాంగులకు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం కలదు. ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు,3  గంటలకి అనుమతిస్తారు. 18వ తేదీన ఐదు సంవత్సరం, ఐదు సంవత్సరం లోపు వయసున్న చిన్నపిల్లల తల్లీతండ్రులకు ప్రత్యేక దర్శనం కలదు. ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 1.30గంటకు అనుమతిస్తారు


logo