మంగళవారం 26 మే 2020
Telangana - May 13, 2020 , 06:31:44

బీటెక్‌లో డిటెన్షన్‌ రద్దు?

బీటెక్‌లో డిటెన్షన్‌ రద్దు?

హైదరాబాద్ : బీటెక్‌ విద్యార్థులకు డిటెన్షన్‌ విధానాన్ని తాత్కాలికంగా రద్దుచేయాలని జేఎన్టీయూహెచ్‌ భావిస్తున్నది. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా 60 శాతమే వినియోగించుకున్నారు. జూలై లో జరిగే సెమిస్టర్‌ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో వర్సిటీ పరిధిలో ఈ ఏడాదికి డిటెన్షన్‌ రద్దుచేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. సెమిస్టర్‌ ప్రశ్నపత్రంలోనూ కొన్ని మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఈసారి ప్రతిసెక్షన్లో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి విద్యార్థి ఎంపికను సులభం చేయాలని భావిస్తున్నారు. 


logo