సోమవారం 25 మే 2020
Telangana - Mar 30, 2020 , 12:51:14

నిర్మల్‌ జిల్లాలోని కరోనా పాజిటివ్‌ కేసులు లేవు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ జిల్లాలోని కరోనా పాజిటివ్‌ కేసులు లేవు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌: జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో 1034 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిని క్వారంటైన్‌లో పెట్టాం. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దు. స్వియ నియంత్రణలో ఉండాలని, అత్యవసరమైతే బయటకు రావాలని సూచించారు.  రైతుల పనులకు ఆటంకం లేకుండా చూడాలని, కూరగాయలు సాగు చేసే రైతులకు పాసులు మంజూరు చేయాలని పోలీసులకు ఆదేశించారు. 

ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడు కోట్ల ఏసీడీపీ నిధులను అందిస్తామని, ఒక రోజు వేతనాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఏరియ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డు, పాలిటెక్నిక్‌ కాలేజీలో క్వారంటైన్‌ ఏర్పాటు చేశాం. జిల్లాలో ఎవరికి కరోనా పాజిటీవ్‌ రాలేదు. ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలను సోషల్ మీడియా ద్వారా భయబ్రాంతుకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


logo