సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 20:51:00

దేశ రక్షణ విషయంలో రాజీపడొద్దు: సీఎం కేసీఆర్‌

దేశ రక్షణ విషయంలో రాజీపడొద్దు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం,  తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. చైనా గానీ, మరే దేశంగానీ భారత్‌ సౌర్వభౌమత్వం విషయంలో వేలు పెడితే, తప్పక ప్రతిఘటించాలని, తగిన సమాధానం చెప్పాలని సీఎం అన్నారు. 

దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరంలేదని, దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమని అభిప్రాయపడ్డారు. లడఖ్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికులకు వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు  రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. 


logo