గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 14:32:16

నాలుగేండ్ల త‌ర్వాత నిండిన నిజాంసాగ‌ర్.. 8 గేట్ల ఎత్తివేత‌

నాలుగేండ్ల త‌ర్వాత నిండిన నిజాంసాగ‌ర్.. 8 గేట్ల ఎత్తివేత‌

కామారెడ్డి: జిల్లాలోని నిజాంసాగ‌ర్ ప్రాజెక్టు నాలుగేండ్ల త‌ర్వాత పూర్తిగా నిండిది. ఎగువ‌న కురిన వ‌ర్షాల‌తో పెద్దఎత్తున్న నీరు ప్రాజెక్టులోకి వ‌చ్చిచేరుతున్న‌ది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరుకుంది. భారీగా వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో 8 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రాజెక్టులోకి 1,01,981 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌స్తున్న‌ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 17 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుతం 15 టీఎంసీలు నిల్వ ఉన్న‌ది. నీటిమ‌ట్టం 1403 అడుగుల వ‌ద్ద ఉన్న‌ది. 

ప్రాజెక్టు గేట్లు ఎత్త‌డంతో దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చరించారు. కాగా, చాలారోజుల త‌ర్వాత ప్రాజెక్టు నిండ‌టంతో రైతులు ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo