ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 00:49:43

ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో కత్తులతో వీరంగం

ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో కత్తులతో వీరంగం

  • అల్లీపూర్‌లో బీజేపీ కార్యకర్తల హల్‌చల్‌

రాయికల్‌ రూరల్‌: జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో మంగళవారం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీయగా పలువురు డీజే పాటల మధ్య తల్వార్లు, కత్తులతో నృత్యాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేశారు. విషయం తెలుసుకున్న రాయికల్‌ పోలీసులు అక్కడికి చేరుకొని తల్వార్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఏడుగురు బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.logo