బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 18:48:44

ఎంపీ అర్వింద్‌కు రైతులే గుణపాఠం చెప్తారు

ఎంపీ అర్వింద్‌కు రైతులే గుణపాఠం చెప్తారు

కరీంనగర్‌ : రానున్న రోజుల్లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కోరుట్ల నియోజకవర్గ రైతులు గుణపాఠం చెప్పడం ఖాయమని కోరుట్ల ఎమ్మెల్యే, ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం మెట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మల్లాపూర్‌ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ మండల మాజీ కార్యదర్శి తోట్ల మహేందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సుమారు వంద మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గెలిచిన పది రోజుల్లో పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తానని, ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని గత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో అర్వింద్‌ మోసపూరిత హామీలిచ్చి ఎంపీగా గెలిచారన్నారు.  ఏడాది గడిచినా ఏ హామీని నేరవేర్చలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాణవేని సుజాత, మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బోయినిపల్లి చంద్రశేఖరరావు, నాయకులు పాల్గొన్నారు.