గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 18:21:46

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 13 నామినేషన్‌ సెట్లు దాఖలయ్యాయి. ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నాలుగు సెట్ల నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాష్‌రెడ్డి తలో రెండు సెట్ల నామినేషన్లు వేశారు. శ్రమజీవి పార్టీ నుంచి భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్‌ ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 23న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఏప్రిల్‌ 7వ తేదీన పోలింగ్‌ నిర్వహణ జరగనుంది.


logo
>>>>>>