గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 12:04:00

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌.. పోలింగ్ సామాగ్రి పంపిణీ

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌.. పోలింగ్ సామాగ్రి పంపిణీ

నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్, పెన్నులు, ఇతర సామాగ్రిని అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి మూలంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు సైతం అందిస్తున్నారు. 


ఉమ్మడి నిజా‌మా‌బాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచా‌ర‌ప‌ర్వా‌నికి బుధ‌వారం తెర పడింది. శుక్ర‌వారం పోలింగ్‌ ఉండ‌టంతో జిల్లా ఎన్ని‌కల యంత్రాంగం అందుకు తగ్గ‌ట్లుగా ఏర్పా ట్లు చేస్తు‌న్నది. మొదట్లో 6 పోలింగ్‌ కేంద్రా‌లను మాత్రమే నిర్ణ‌యిం‌చగా కరోనా నేప‌థ్యంలో వీటిని ఏకంగా 50కి పెంచారు. ఇందులో నిజా‌మా‌బాద్‌ జిల్లాలో 28, కామా‌రెడ్డి జిల్లాలో 22 ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లు ఉంటే వీరిలో 24 మంది ఓట‌ర్లకు కరోనా నిర్ధా‌రణ అయ్యింది. వీరిలో ఒకరు మాత్రమే పోస్టల్‌ బ్యాలె‌ట్‌కు దర‌ఖాస్తు చేసు‌కు‌న్నారు. కరోనా సోకి‌న‌వారు పోలింగ్‌ కేంద్రా‌నికి వచ్చి ఓటు వేయా‌ల‌ను‌కుంటే తప్ప‌ని‌స‌రిగా పీపీఈ కిట్లు ధరిం‌చాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు అంబు‌లె‌న్సులో లేదంటే సొంత వాహ‌నంలో పోలింగ్‌ రోజు సాయంత్రం 4నుంచి 5గంటల మధ్య రావాలని అధికారులు సూచించారు.

logo