శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 18:03:32

బ్యాలెట్ పేప‌ర్ల‌ ద్వారానే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌

బ్యాలెట్ పేప‌ర్ల‌ ద్వారానే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌

నిజామాబాద్ : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ను బ్యాలెట్ పేప‌ర్ల ద్వారానే నిర్వ‌హిస్తామ‌ని క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి ప్ర‌క‌టించారు. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓట‌ర్ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డంతో నిన్న‌టి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌న్నారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్రచారం నిర్వ‌హించాల‌ని సూచించారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. క్యాంపు రాజ‌కీయాల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నిక‌లో 824 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. కొవిడ్ నేప‌థ్యంలో 50 పోలింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని ఈసీకి ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌ని తెలిపారు. ఈసీ ఒప్పుకోక‌పోతే 6 పోలింగ్ స్టేష‌న్ల‌లోనే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం ప్ర‌త్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెంబ‌ర్ 08462- 220183. 

అక్టోబర్‌ 9న పోలింగ్ నిర్వ‌హించి, 12న ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, విత్‌డ్రా ప్రక్రియ ఇదివరకే ముగియగా, ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వడ్డేపల్లి సుభాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు.  


logo