శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 10:12:34

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌.. ఓటేసిన స్పీక‌ర్

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌.. ఓటేసిన స్పీక‌ర్

బాన్సువాడ‌: నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగ‌తున్న‌ది. శాస‌నస‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి త‌న‌ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న 42వ‌ పోలింగ్ కేంద్రంలో స్పీక‌ర్ ఓటు వేశారు. 

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతున్న ఈ ఉపఎన్నిక‌లో ముగ్గురు అభ్య‌ర్థులు పోటీప‌డుతున్నారు. మొత్తం 824 మంది స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఓటువేయ‌నున్నారు. ఉపఎన్నిక‌ ఫ‌లితాలు ఈనెల 12న వెలువ‌డ‌నున్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo