ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:34:56

ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాకు పితృవియోగం

ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాకు పితృవియోగం

  • నివాళులర్పించిన మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా(72) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికి త్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణమూర్తి గతంలో ఆర్యవైశ్య సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడి పనిచేశా రు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. గణేశ్‌గుప్తా ఎమ్మెల్యే కాగా, మహేశ్‌ గుప్తా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నాయకుడిగా కొనసాగుతున్నారు. కృష్ణమూర్తి మరణవార్త తెలియగానే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు హైదరాబాద్‌లోని దవాఖానకు వెళ్లి గణేశ్‌ గుప్తా, మహేశ్‌ గుప్తాలను పరామర్శించి, ఓదార్చారు. భౌతికకాయానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్థివదేహాన్ని నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, షకీల్‌, కలెక్టర్‌ సీ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంకిషన్‌రావు, మండవ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.