e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home తెలంగాణ యాదాద్రిలో శాస్ర్తోక్తంగా నిత్య పూజలు

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా నిత్య పూజలు

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండ పంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వ రుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

పార్వతీ దేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి, అమ్మ వార్ల ఆశీస్సులు అందజేశారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠ మూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్య నారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement