మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 19:27:55

నీతి అయోగ్ ర్యాంకింగ్స్..14 వ ర్యాంకు సాధించిన జయశంకర్ భూపాలపల్లి

నీతి అయోగ్ ర్యాంకింగ్స్..14 వ ర్యాంకు సాధించిన జయశంకర్ భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి : నీతి అయోగ్ ర్యాంకింగ్స్ లో జిల్లా దేశంలోనే  14 వ ర్యాంకుసాధించడంపై జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అభినందించారు. 2020 సంవత్సరం జూన్ మాసానికి నీతి అయోగ్ ప్రకటించిన అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ర్యాంకింగ్ లో  జిల్లా  వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహార కల్పన, విద్య, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటి వసతుల కల్పన, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాల పెంపుదల, మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా గల 115 అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ర్యాంకింగ్ లో జిల్లా మెరుగైన పురోగతిని సాధించి 14 వ ర్యాంకు సాధించడంపై కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు.

నాలుగు నెలలుగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నా కూడా.. అత్యంత వెనుకబడిన జిల్లా అయినా భూపాలపల్లి  ప్రభుత్వ పథకాలను నిరుపేదల వద్దకు తీసుకెళ్లి వారిని  అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ  ప్రజలకు సేవలందించడం గొప్ప విషయమన్నారు.జిల్లా అభివృద్ధిలో నీతి అయోగ్ సూచించినట్లుగా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కలిసికట్టుగా చేసిన కృషినితోనే  ఈఘనతను సాధించామన్నారు. ఇదే విధమైన స్ఫూర్తిని నిరంతరం కనబరుస్తూ జిల్లా సంపూర్ణ అభివృద్ధికి అధికారులు అంకిత మవ్వాలని కెలెక్టర్ సూచించారు.


logo