మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 13:49:31

వరంగల్‌ ఎన్‌ఐటీ స్కాలర్‌కు కరోనా నెగెటివ్‌

వరంగల్‌ ఎన్‌ఐటీ స్కాలర్‌కు కరోనా నెగెటివ్‌

వరంగల్‌ అర్భన్‌ : వరంగల్‌ నిట్‌ స్కాలర్‌కు కరోనా వైరస్‌ నెగెటివ్‌గా తేలింది. ఎన్‌ఐటీ విద్యార్థి ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌, పూణెకు పంపించారు. రక్తపరీక్షలో కరోనా నెగెటివ్‌గా వచ్చినట్లు గాంధీ మెడికల్‌ కాలేజీ పేర్కొంది. దీంతో నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి. రమణారావు, ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మద్దతుగా నిలిచిన జిల్లా యంత్రాంగానికి, డీఎంహెచ్‌వో, ఎంజీఎం ఆస్పత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


logo
>>>>>>