సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 23:57:51

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం

  • ‘ఏదుల’ను వినియోగంలోకి తేవాలి 
  • పెండింగ్‌ పనులు వెంటనే పూర్తిచేయాలి 
  • అధికారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు రైతాంగానికి జీవాధారమని, మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనులు, ఆన్‌లైన్‌ రిజర్వాయర్ల నిర్మాణంపై శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్‌, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏదుల రిజర్వాయర్‌ను వినియోగంలోకి తీసుకొస్తే కల్వకుర్తి ఎత్తిపోతలపై భారం తగ్గుతుందని చెప్పారు. చివరి ఆయకట్టుకు ఆశించినంత నీళ్లు అందు తాయని చెప్పారు. పనుల్లో లోపాలుంటే వెంటనే పూర్తిచేయాలని కోరారు. 


logo