శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 01:07:24

ఓఎంబీ డైరెక్టర్‌గా నీరా టాండన్‌

ఓఎంబీ డైరెక్టర్‌గా నీరా టాండన్‌

  • మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి

వాషింగ్టన్‌: శ్వేతసౌధంలో మరో కీలక పదవి భారతీయ అమెరికన్‌కు లభించింది. మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ కార్యాలయ (ఓఎంబీ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన నీరా టాం డన్‌ను నియమిస్తున్నట్టు అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఓఎంబీ సారథ్యం చేపట్టనున్న తొలి మహిళ, తొలి ఇండియన్‌ అమెరికన్‌ టాండన్‌ కావడం విశేషం. 50 ఏండ్ల టాండన్‌ ప్రస్తుతం ‘సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌' చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. హిల్లరీ క్లింటన్‌కు సన్నిహితురాలిగా పేరొందారు. ఆర్థికమంత్రిగా జనేట్‌ యెలెన్‌ (74)ను నియమిస్తున్నట్టు బైడెన్‌ ప్రకటించారు. ఈ శాఖకు తొలి మహిళ ఆమె. తొలిసారిగా వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీతోపాటు కమ్యూనికేషన్‌ బృం దసభ్యులుగా అందరూ మహిళలనే నియమించారు. logo