మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 13:06:10

కోవిడ్‌-19తో నిలోఫ‌ర్ ఆస్ప‌త్రి మ‌హిళా టెక్నీషియ‌న్ మృతి

కోవిడ్‌-19తో నిలోఫ‌ర్ ఆస్ప‌త్రి మ‌హిళా టెక్నీషియ‌న్ మృతి

హైద‌రాబాద్: నిలోఫ‌ర్ ఆస్ప‌త్రి మ‌హిళా ఔట్‌సోర్సింగ్ టెక్నీషియ‌న్‌ కోవిడ్‌-19తో మృతిచెందింది. మ‌ధుల‌త(35) అనే మ‌హిళా ఉద్యోగిని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలోని రేడియాల‌జీ విభాగంలో ఈఈజీ టెక్నీషియ‌న్‌గా ప‌నిచేస్తుంది. క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌నాటి నుంచి ఆమె గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నిన్న రాత్రి క‌న్నుమూసింది. ఆమె భ‌ర్త‌కు సైతం క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నాడు. కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు త‌గిన న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేవిధంగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల్సిందిగా వైద్య సిబ్బంది రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని కోరింది. 


logo