గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 20:42:17

కరోనా ఎఫెక్ట్‌.. ఆన్‌లైన్‌లో నిఖా

కరోనా ఎఫెక్ట్‌.. ఆన్‌లైన్‌లో నిఖా

ఖమ్మం : ముస్లింల నిఖా సాధారణంగా పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకును దూరంగా ఉంచే జరిపిస్తారు. ఒకే మండపం అయినప్పటికీ రెండు వేర్వేరు గదుల్లో ఇద్దరిని ఉంచి సంతకాల ద్వారా నిఖా జరుపుతారు. కానీ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ లో నిఖా జరిపించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలకు చెందిన షబానా అనే అమ్మాయికి నిర్మల్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది.  ఈ యువకుడు సౌదీలో స్థిరపడ్డాడు. ఈ నెల 12న పెళ్లికుమారుడు ఖమ్మం రావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్‌తో సౌదీ నుంచి రాకపోకలు నిషేధించడంతో అక్కడే ఉండిపోయాడు. దీంతో అనుకున్న ముహూర్తం ప్రకారం బంధువులు పెళ్లి జరిపించాలని నిశ్చయించుకొని ఆన్‌లైన్‌ పెళ్లికి ఆలోచన చేశారు.

దీంతో ముస్లిం సంప్రదాయం ప్రకారమే ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం రాత్రి పెళ్లి కూతురు షబానాకు, సౌదిలో ఉన్న అబ్బాయితో ఆన్‌లైన్‌లో మతపెద్దలు నిఖా జరిపించారు. పెండ్లిలో భాగంగా అక్కడి బంధువులు, ఇక్కడి బంధువులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ నిఖాను బంధువులు ఆన్ లైన్ లో తిలకించి ఆశీర్వదించారు.  


logo