మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:14:53

హుస్సేన్ సాగ‌ర్ ప‌రిధిలో నైట్ బజార్లు!

హుస్సేన్ సాగ‌ర్ ప‌రిధిలో నైట్ బజార్లు!

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో ప‌ర్యాట‌క అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగ‌ర్ ప‌రిధిలో నైట్ బ‌జార్ల‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీపీఈ ప‌ద్ధ‌తిలో నైట్ బ‌జార్ల ఏర్పాటుకు టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తామ‌న్నారు. అదే ప‌ద్ధ‌తిలో ఈ బ‌జార్ల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. బోర్డు వాక్‌, పార్కింగ్‌, సిట్టింగ్ త‌దిత‌ర సౌక‌ర్యాల‌తో నైట్ బ‌జార్లను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ‌