గురువారం 09 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:29

ఇక్కడే మూడు యూనిట్లుండటం సంతోషం

ఇక్కడే మూడు యూనిట్లుండటం సంతోషం

  • ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాసా ఆధ్వర్యంలోని జేపీఎల్‌ కేంద్రంగా వెంటిలేటర్లను తయారుచేస్తున్న కంపెనీలకు సంబంధించిన మూడు యూనిట్లు హైదరాబాద్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉన్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వాటిద్వారా అమెరికా- ఇండియా మధ్య సహకారం, వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడుతాయని పేర్కొన్నారు. వెంటిలేటర్ల తయారీ కోసం నాసా.. ఆల్ఫాడిజైన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలను ఎంపికచేసింది. జేపీఎల్‌..  వెంటిలేటర్‌ ఇంటర్‌వెన్షన్‌ టెక్నాలజీ యాక్సెసిబుల్‌ లోకల్లి (వీఐటీఏఎల్‌) వెంటిలేటర్లు తయారుచేసే 3 యూనిట్లు కూడా ఇక్కడే ఉన్నాయని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జో యల్‌ రిఫ్‌మ్యాన్‌ గురువారం ట్విట్టర్‌లో తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా మేధా సర్వో డ్రైవ్స్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని కంపెనీని అభినందించారు. ఇది అమెరికా, ఇండియా సంబంధాలను మరింత బలపరుస్తుందని తెలిపారు. 


logo