గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 15:59:03

'బెంగ‌ళూరు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లండి'

'బెంగ‌ళూరు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లండి'

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద 44వ జాతీయ‌ర‌హ‌దారిపై వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వాన‌ల‌తో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి కోత‌కు గుర‌య్యింది. అప్ప చెరువు తెగ‌డంతో జాతీయ ర‌హ‌దారిపైకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చింది. దీంతో 44వ జాతీయ ర‌హ‌దారి పూర్తిగా ధ్వంస‌మైంది. ఈ క్ర‌మంలో 44వ జాతీయ ర‌హ‌దారికి బ‌దులుగా ఔట‌ర్ రింగ్ రోడ్డును ఉప‌యోగించుకోవాల‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారుల‌కు, ప్ర‌యాణికుల‌కు సూచించారు. హైద‌రాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు, శంషాబాద్‌, క‌ర్నూల్‌, బెంగ‌ళూరు వైపు వెళ్లేవారు ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాల‌ని సూచించారు. మెహిదీప‌ట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే పీవీ న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్ వేను కూడా మూసివేశారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై రాక‌పోక‌ల నిషేధం ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.