శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 09:41:33

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై నేడు తీర్పివ్వ‌నున్న ఎన్జీటీ

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై నేడు తీర్పివ్వ‌నున్న ఎన్జీటీ

హైద‌రాబాద్‌: రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ) చెన్నై ధ‌ర్మాస‌నం ఇవాళ తీర్పు వెలువ‌రించ‌నుంది. ఇరుప‌క్షాల వాద‌న‌లు పూర్త‌వ‌డంతో సెప్టెంబ‌ర్ 3న తీర్పును రిజ‌ర్వు చేసింది. ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేవ‌ని రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కృష్ణాన‌దిపై శ్రీశైలం ఎగువ‌న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు నిర్మించ‌డంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం వ్య‌క్తంచేసింది. ప్రాజెక్టు సామ‌ర్థ్యం రెట్టింపు చేసినందువ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కావాల‌ని ప్ర‌భుత్వం ధ‌ర్మాస‌నానికి వెల్ల‌డించింది. అయితే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల పాత ప్రాజెక్టే అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వాదించింది.  ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరుప‌క్షాల తుది వాద‌న‌లు గ‌త నెల‌లో పూర్త‌య్యాయి.    ‌