సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 00:03:41

ఐజీసీపీ సైంటిఫిక్‌ బోర్డుకు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త

ఐజీసీపీ సైంటిఫిక్‌ బోర్డుకు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త

ఉప్పల్‌, జనవరి 1:  ఇంటర్నేషనల్‌ జియోసైన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐజీసీపీ) సైంటిఫిక్‌ బోర్డుకు సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ గ్రౌండ్‌వాటర్‌ సైంటిస్టు తన్వీ ఆరోరా నామినేట్‌ అయ్యారు. 11 మంది సభ్యుల బృందంలో ఆరోరా ఒకరు.  ఆరోరా హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ నుంచి ఎంపికైన మొదటి శాస్త్రవేత్త కావడం విశేషం. శాస్త్రీయ ప్రాజెక్టులపై సాంకేతిక నైపుణ్యం, సలహాలను అందించడానికి ఈ బృందం పనిచేస్తుంది. హైడ్రోజియాలజీ థీమ్‌కు అవసరమైన శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు కృషి చేయనున్నారు.  


logo