సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 22:12:20

బంజారా మహిళా ఎన్జీవో కరోనా సహాయక శిబిరం

బంజారా మహిళా ఎన్జీవో కరోనా సహాయక శిబిరం

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డాక్టర్‌ ఆనంద్‌ బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో తన మిత్రులు హేమ పోలోగి సహకారంతో తెలంగాణ రాష్ట్రం, నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు, పేద ప్రజలు, వలస కూలీలకు నిత్యావసర వస్తువులను ప్రశాంత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అందించారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భౌతిక దూరాన్ని పాటించి, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలన్నారు. డాక్టర్‌ ఆనంద్‌ ఇప్పటికే బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు పదిహేను రాష్ర్టాలలో కరోనా సహాయక శిబిరాలు నిర్వహిస్తున్నారు. 


logo