గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 23:49:27

నవవధువు బలవన్మరణం

నవవధువు బలవన్మరణం

-అమెరికా ఉద్యోగమంటూ అత్తింటివారి మోసం

-మనస్తాపంతో ఆత్మహత్య 

చివ్వెంల: జీవితాంతం తోడుంటానని బాస చేసిన వ్యక్తి నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక పెండ్లయి వారం తిరగకముందే ఓ నవవధువు తనువు చాలించింది. అమెరికాలో ఉద్యోగమని, ఆస్తిపాస్తులు భారీగా ఉన్నాయంటూ అత్తింటివారి చెప్పిన మాటలు అబద్ధమని తెలిసి కాళ్లపారాణి ఆరకముందే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘట న సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ ఆవాసగ్రామం వినాయకనగర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌కు చెందిన సామ ఇంద్రారెడ్డి-మంజుల పెద్ద కుమార్తె మౌనికారెడ్డికి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన బద్దం శ్రీనివాస్‌రెడ్డి-సునీతల కుమారుడు సాయికిరణ్‌రెడ్డితో ఈనెల 15న వివాహం జరి గింది. పెండ్లికి ముందు సాయికిరణ్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని, హైదరాబాద్‌ పరిసరాల్లో రూ.కోట్ల విలువైన భూములు ఉన్నట్టు చెప్పారు. వారి మాట లు నమ్మిన మౌనికారెడ్డి తల్లిదండ్రులు రూ.10 లక్షలతోపాటు 35 తులాల బంగా రం, 4 కిలోల వెండి వస్తువులు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కాగా, పెండ్లయిన ఆరోరోజే సాయికిరణ్‌రెడ్డి కుటుంబానికి అప్పులు ఉన్నట్టు పసిగట్టిన మౌనికారెడ్డి భర్తను నిలదీసింది. తనకు జాబ్‌ లేదని, అదనపు కట్నం తేవాలని డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తనను ఉగాదికి తీసుకెళ్లాలని కోరింది. దీంతో శనివారం వచ్చిన మౌనికారెడ్డి తల్లిదండ్రులు ఆస్తుల గురించి వాకబు చేశారు. ఈ క్రమంలో ఇంద్రారెడ్డి, మంజులపై మౌనిక అత్తామామలు శ్రీనివాస్‌రెడ్డి, సునీత, భర్త సాయికిరణ్‌రెడ్డి, ఆడబిడ్డ వినీతలు కలిసి  దాడి చేశారు. అనంత రం శనివారం రాత్రి 8గంటలకు మౌనికను తీసుకొని సూర్యాపేటకు వెళ్లారు. రాత్రి కుటుంబ సభ్యులంతా హాల్‌లో నిద్రకు ఉపక్రమించగా మౌనిక మాత్రం బెడ్‌రూం లోకి వెళ్లింది. ఉదయం తల్లిదండ్రులు చూడగా బెడ్‌రూంలో ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. ఘటన స్థలంలో సూసై డ్‌ నోట్‌ లభించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మౌనిక అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


logo