మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 13:10:43

ఎంపీ అస‌ద్‌ను క‌లిసిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు

ఎంపీ అస‌ద్‌ను క‌లిసిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్‌: బీహార్ ఎన్నిక‌ల్లో మ‌జ్లీస్ (ఎంఐఎం) పార్టీ స‌త్తా చాటింది. ఈ ఎన్నిక‌ల్లో ఐదు స్థానాల్లో విజ‌యం సాధించింది. కొత్త‌గా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీని ఇవాళ‌ క‌లిశారు. మూడు విడుత‌ల్లో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో మ‌జ్లీస్ పార్టీ 28 స్థానాల్లో పోటీచేసింది. ఇందులో అమౌర్‌, కొచ్చాదామ‌మ్‌, జోకిహట్‌, బైసీ, బ‌హ‌దూర్‌గంజ్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపొందింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క స్థానానికే ప‌రిమిత‌మైన మ‌జ్లీస్ ఈసారి త‌న సంఖ్య‌ను ఐదుకు పెంచుకున్న‌ది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా సీమాంచల్ రీజియ‌న్‌లో పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపింది‌.