మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 02:11:49

కొత్తగా 34వేల ఎస్‌హెచ్‌జీలు

కొత్తగా 34వేల ఎస్‌హెచ్‌జీలు

నాలుగు లక్షల మంది సభ్యుల చేరిక

హైదరాబాద్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ)ల ఏర్పాటు జోరుగా సాగుతున్నది. కొత్తగా 34వేల గ్రూపులు ఏర్పాటు కాగా, నాలుగు లక్షల మంది సభ్యులుగా చేరారు. అర్హులైన వారందరినీ ఎస్‌హెచ్‌జీల్లో చేర్చేందుకు ప్రభుత్వం డిసెంబర్‌ ఐదున ప్రారంభించిన స్పెషల్‌ డ్రైవ్‌ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ దిశగా సెర్ప్‌ అధికారులు కృషి చేస్తున్నారు. ఇంతకుముందు ఏర్పడిన 12వేల గ్రూపుల్లో ఖాళీ అయిన సభ్యుల స్థానంలో కొత్త వారిని చేరుస్తున్నారు. ఆ విధంగా 25వేలమంది చేరినట్టు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 79 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 43.29 లక్షల మంది ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులుగా ఉన్నారు. వృద్ధులు, ఆసరా పెన్షన్‌ పొందుతున్న వారు 12.78 లక్షల మంది ఉన్నారు. వీరిని ఎస్‌హెచ్‌జీల్లో చేర్చుకొనే అవకాశం లేదు. మిగిలిన 23లక్షల మందిని ఎస్‌హెచ్‌జీల్లో చేర్చడానికే ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. 

VIDEOS

logo