గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 09:09:04

రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్‌ కేసులు

 రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 338 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 82,647కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 8 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 645కి చేరింది. ప్రస్తుతం 22,628 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 18,035 నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6,42,875 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది. ఇంకా 959 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజాగా 1,587 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 59,374 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 71.84 శాతంగా ఉందని, ఇది దేశ సగటుకు కంటే ఎక్కువ అని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 69.33గా ఉంది. మరో 15,554 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.