సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:22:09

‘టీకా’ ముసుగు.. ఖాతాఖాళీ!

‘టీకా’ ముసుగు.. ఖాతాఖాళీ!

  • సైబర్‌ కేటుగాళ్ల సరికొత్త వ్యూహం
  • ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలతో లూటీ
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైబర్‌ కేటుగాళ్లు మరో సరికొత్త మోసానికి తెరలేపారు. కాలానుగుణంగా తమ వ్యూహాలకు పదును పెడుతూ అమాయకుల సొమ్ము కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా అంతానికి టీకాలు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన వేళ దానిని ఆసరాగా చేసుకొని అమాయకుల నుంచి డబ్బు దండుకొనేందుకు ఈ బ్యాచ్‌లు ఏర్పాట్లుచేసుకుంటున్నాయి. టీకా వేసేందుకు మీ ఆధార్‌ కార్డు నంబర్‌, ఈ మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ ఇస్తే.. మీకు ఒక ఓటీపీ పంపిస్తామని సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. వారి మాటలు నమ్మి వివరాలు పంపడంతోపాటు ఓటీపీ చెప్తే చాలు మన బ్యాంకు ఖాతా ఖాళీ అవడం పక్కా. ఇందుకు సైబర్‌ నేరగాళ్లు మన ఆధార్‌ నంబర్‌ను వాడుకొంటున్నారు. మన ఆధార్‌ నంబర్‌ బ్యాంకు ఖాతాకు లింకుచేసి ఉండటమే ఇందులోని అసలు కిటుకు. ఇలా మన ఖాతా వివరాలు సేకరించి మన ద్వారానే ఓటీపీ చెప్పించుకొని, మన సొమ్ము కొల్లగొడుతారు. ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.


logo