ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 18:51:55

బాసరలో నూతన సంవత్సర సందడి

బాసరలో నూతన సంవత్సర సందడి

నిర్మల్‌/బాసర : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర భక్తులు తరలివచ్చారు. అమ్మవారి చెంత తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించారు. కొత్తగా నియమితులైన భైంసా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. 


logo