రోజంతా గులాబీ శ్రేణులతో..

- తెలంగాణభవన్‌లోనే మంత్రి కేటీఆర్
- పోటెత్తిన నాయకులు, ప్రజలు
- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతనసంవత్సర శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నిత్యం అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణుల నడుమ గడిపారు. తెలంగాణ భవన్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మంత్రులు, పార్టీ శ్రేణులు, సాధారణ ప్రజలతో మమేకం అయ్యారు. ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్‌తో కలిసి ఫొటో లు దిగేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు.
మూడంచెల పలుకరింపు..
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారని తెలుసుకున్న శ్రేణులు రాష్ట్ర నలుమూలల నుంచి పుష్పగుచ్ఛాలు, హరిత జ్ఞాపికలు, మిఠాయిలతో తరలివచ్చారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోగానే ఒక్కసారిగా జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. రామన్న నాయకత్వం వర్ధిల్లాలి.. లాంగ్ లివ్.. లాంగ్ లివ్.. టీఆర్ఎస్ లాంగ్ లివ్ అన్న నినాదాలు మిన్నంటాయి. కేటీఆర్ ముందుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, పార్టీ సీనియర్ నాయకులను, శ్రేణులను ఇలా మూడు విభాగాలవారిని విడివిడిగా కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రులు వారివారి జిల్లాలకు వెళ్లాల్సి ఉన్నందున ముందుగా వారిని కలిశారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పార్టీ శ్రేణులతో గడిపారు. దాదాపు మూడున్నర గంటలపాటు విరామం లేకుండా అక్కడికి వచ్చిన ప్రతి నాయకుడిని, కార్యకర్తను కలిసి పలుకరించారు. తమతమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని కొంతమంది నాయకులు.. తమ ప్రాంతంలో పర్యటించాలని మరికొందరు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని, అదే సమయంలో కచ్చితంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలను, నాయకులను పేరుపేరునా పలుకరించి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చినవారిలో అత్యధికంగా యువత ఉండటం గమనార్హం.
వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసినవారిలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్ బాల్క సుమన్, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు బీబీ పాటిల్, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, బస్వరాజు సారయ్య, పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మంద జగన్నాథం, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, కాలేరు వెంకటేశ్, మాగుంట గోపీనాథ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రైతు బంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి వై సతీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు
పార్టీ శ్రేణులే కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పెన్షనర్లు భారీ ఎత్తున తెలంగాణ భవన్‌కు తరలివచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్ సారథ్యంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తదితరులు మంత్రి కేటీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజావార్తలు
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్‌తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
- వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర గురించి మీకు తెలుసా!