సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 17:10:38

పదోన్నతులు జనవరిలోగా పూర్తి చేయాలి : సీఎస్‌

పదోన్నతులు జనవరిలోగా పూర్తి చేయాలి : సీఎస్‌

హైదరాబాద్‌ : బీఆకేఆర్‌ భవన్‌లో శనివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పాల్గొని.. ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా మరింత ఉత్సాహంతో పని చేయాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో ఒక టీం వర్క్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. సచివాలయం, హెచ్‌ఓడీలు, జిల్లాల్లోని అన్ని కేడర్లలో పదోన్నతులను జనవరిలోగా పూర్తి చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. పదోన్నతుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.